రఘునాథపాలెం, జూన్ 2: భూ వివాదాల ముసుగులో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓ బీఆర్ఎస్ కార్యకర్తను హత్య చేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం శివాయిగూడెం లో ఆదివారం చోటుచేసుకుంది. శివాయిగూ డెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త తేజావత్ హతీరాం.. కోయచలక రెవెన్యూ పరిధిలోని తన ఎకరం అసైన్డ్ భూమిని అదే గ్రామానికి చెందిన లాల్సింగ్ (బీఆర్ఎస్ కార్యకర్త)కు విక్రయించాడు.
అసైన్డ్ భూమి కావడంతో తా ను అమ్మిన భూమిని తిరిగి ఆక్రమించుకోవాలని హతీరాం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భుక్యా బా లాజీని ఆశ్రయించాడు. దీనిపై బాలాజీ చర్చలకు తమ ఇంటికి రావాలని లాల్సింగ్ను ఆదేశించాడు. తనకు అన్యాయం జరుగుతుందని భావించిన లాల్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు.
దీంతో అక్కసుతో లాల్సింగ్కు అనుకూలుడైన సీఆర్పీఎఫ్ జవాన్ మాలోతు రవి బయటకు వెళ్లి వస్తుండగా.. కాంగ్రెస్ కార్యకర్తలు బానోతు దశరథ్, బానో తు రమేశ్, భుక్యా బాలాజీ, విజయ్, ఉమ కలిసి అతడిపై దాడి చేశారు. అడ్డుగా వచ్చిన జవాన్ రవి భార్యను అందరి ముందే వివస్త్రను చేశారు. రవిపై దాడి చేస్తుండటాన్ని గమనించిన అతడి పెద్దనాన్న తేజావత్ ఈర్య అలియాస్ పాప (55) (గ్రామ బీఆర్ఎస్ మాజీ ఉప సర్పంచ్ శారద మామ) అడ్డుకోగా..
కాంగ్రెస్ కార్యకర్త తేజావత్ దశరథ్ అతడి ఛాతీపై బలంగా కొట్టడంతో కింద పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. ఉద్దేశపూర్వకంగానే దాడి చేసి బీఆర్ఎస్ కార్యకర్తను హతమార్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. గ్రామ బీఆర్ఎస్ నాయకులు ఇల్లెందు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. బాధ్యులపై చర్య లు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.