మలిసంధ్యలో ఒంటరితనం ఒక్కటే తోడుగా ఉంటుంది. జీవితం ఏకాంతంగా మారుతుంది. వృద్ధాప్యంలో తోడు, నీడ కరువైన వారికి సిద్దిపేట పట్టణ నిరాశ్రయుల ఆశ్రమం మనోధైర్యం కల్పిస్తున్నది. పట్టణంలోని మణికంఠనగర్లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆశ్రమం ఆత్మీయ భరోసా ఇస్తున్నది.
వారి బాధలు, మానసిక ఒత్తిడిని మరిపించే ఆనంద నిలయంగా మారింది. ఆదివారం ఆశ్రమంలో వృద్ధులు ఆనందంగా ఆటలాడుతుండగా, ఈ దృశ్యాన్ని ‘నమస్తే తెలంగాణ’ కెమెరాలో బంధించింది.