శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 24: సాంకేతిక సమస్యతో హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ఇండియా విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు శంషాబాద్ నుం చి లండన్ వెళ్లాల్సిన ఏఐ 147 విమానంలో సాంకేతిక సమస్య రావడంతో ఎయిర్‌పోర్టులోనే నిలిపివేశారు. ఉద యం 11 గంటలు దాటినా విమా నం బయలుదేరకపోవడంతో ఎయిర్ఇండి యా సిబ్బందిపై ప్రయాణికులు ఆగ్ర హం వ్యక్తంచేశారు. ఎట్టకేలకు మధ్యా హ్నం 3.45 గంటలకు విమానం బయలుదేరినట్టు అధికారులు తెలిపారు.