గంగాధర, మార్చి 9: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు నిరసన సెగ తగిలింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలో ఆదివా రం బస్సు సర్వీసును ప్రారంభించి, గర్శకుర్తి వరకు ప్రయాణించారు. గ్రా మంలో మాట్లాడి వెళ్తుండగా, స్థానికులు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎన్నికల సమయంలో గర్శకుర్తిని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తామ ని హామీ ఇచ్చారని, ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పాలని నిలదీశారు. సాగునీరందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడంలేదని, రైతు భరోసా ఇ వ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.