తొర్రూరు, డిసెంబర్ 9: ‘కల్యాణలక్ష్మి’ ఎం దుకొస్తలేదు?, రూ.4,000 పెన్షన్ ఎప్పుడిస్త రు?’ అని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డిని మహిళలు నిలదీశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్టె గ్రామంలో మంగళవారం ఆమె పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమలక్ష్మి అనే మహిళ మాట్లాడుతూ.. ‘నా మనుమరాలికి పెళ్లయి రెండేండ్లు అయితాంది. కల్యాణ లక్ష్మి పైసలు ఎందుకొస్తలేవు? ఆమెకు బిడ్డ పుట్టింది’ అని ప్ర శ్నించింది. ‘పెన్షన్ రూ. 4,000 ఇస్తామని ఇప్పటికీ ఇయ్యలే. ఎప్పుడిస్తరు?’ అని ఓ వృద్ధురాలు ఝాన్సీరెడ్డిని నిలదీసింది. ‘రెండేండ్లుగా గ్రామపంచాయతీలకు సర్పంచ్లు లేరు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే కల్యాణలక్ష్మీ చెకులు అందుతాయి అనడంతో వారు కంగుతిన్నారు.