వెల్ఫేర్ బోర్డు పోస్టుల కోసం పైరవీలు
డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్, జువైనల్ జస్టిస్ బోర్డు చైర్మన్, సభ్యుల పోస్టుల ఇంట ర్వ్యూ ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో కొందరు అభ్యర్థులు జోరుగా పైరవీలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
- ప్రజాప్రతినిధుల ద్వారా అధికారులపై ఒత్తిళ్లు
- సెక్రటేరియట్, డైరెక్టరేట్ ఆఫీసుల చుట్టూ చక్కర్లు
- 22 నుంచి ఇంటర్వ్యూలు
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్, జువైనల్ జస్టిస్ బోర్డు చైర్మన్, సభ్యుల పోస్టుల ఇంట ర్వ్యూ ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో కొందరు అభ్యర్థులు జోరుగా పైరవీలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. నాలుగున్నరేండ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ నియామకాలు చేపడుతుండడంతో ఈ పోస్టులకు భారీగా డిమాండ్ పెరిగింది. ఎలాగైనా దక్కించుకోవాలని ఆశావహ అభ్యర్థులు ఉబలాటపడుతున్నారు.
ఈ క్రమంలో ఇంటర్వ్యూకు ఎంపికైన కొందరు అభ్యర్థు లు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను ఆశ్రయించినట్టు సమాచారం. వీరి ద్వారా సంబంధితశాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు తెలిసింది.. ఇంటర్వ్యూ తేదీలు ఖరారైనప్పటి నుంచి అటు సెక్రటేరియట్, ఇటూ మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఒకరిద్దరు మంత్రు లు, కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు త మ వారికి ఇప్పించుకునేందుకు అధికారుల కు సిఫార్సు చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.
బోర్డు సభ్యుల పోస్టులకు భారీ డిమాండ్
సుదీర్ఘకాలం తర్వాత డీసీడబ్ల్యూసీ, జేజేడబ్ల్యూ బోర్డు సభ్యుల నియామకం చేపడుతుండటం.. ప్రస్తుత నియామకం తర్వాత మూడు, నాలుగేండ్లు కొనసాగే అవకాశం ఉండడంతో ఈ పోస్టులకు భారీ డిమాండ్ పెరిగింది. 33 జిల్లాల పరిధిలోని 36 బోర్డులకు ఏడుగురు చొప్పున 252 మందిని నియమించనున్నారు. దీనికి ఏప్రిల్ 19న పరీక్ష నిర్వహించారు. 3 రోజుల క్రితం 1:2.5 నిష్పత్తిలో 602 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచారు.
వీరిలో బోర్డు చైర్మన్/చైర్పర్సన్తో పాటు ఆరుగురిని సభ్యులుగా ఎంపిక చేయనున్నారు. భారీ పోటీ ఉన్న నేపథ్యంలో అధికారపార్టీ నేతల అండదండలున్న కొందరు అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణలు ఉన్నా యి. పోస్టులు దక్కించుకునేందుకు రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు ముట్టజెప్పేందుకు సైతం సిద్ధపడుతున్నట్టు తెలుస్తున్నది. దీంతో ఈ నియామక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

