Runa Mafi | హైదరాబాద్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ): రైతు రుణమాఫీ కథ ముగిసింది! అంచనాలు తగ్గించి, బ్యాంకులపై నెపం నెట్టిన ప్రభుత్వం లక్షలాది రైతుల బాకీని అలాగే ఉంచింది. తొలుత రూ.31 వేల కోట్లు మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. చివరికి రూ.20 వేల కోట్లతోనే సరిపెట్టింది. చివరి విడత రుణమాఫీ పూర్తి చేసినట్టు ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో రూ.2 లక్షలకుపైగా రుణం కలిగిన రైతుల పరిస్థితి ఏమిటనే చర్చ జరుగుతున్నది.
వారికి మొండిచేయి చూపినట్టేననే అభిప్రాయాలువ్యక్తమవుతున్నాయి.మొన్నటివరకు రూ.2 లక్షలకుపైగా రుణాలున్న రైతులు ఆపై మొత్తా న్ని బ్యాంకుల్లో చెల్లిస్తే రూ.2 లక్షలు వారి ఖా తాల్లో వేస్తామని సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు చెప్పేవారు. కానీ, ఆదివారం సీఎం రేవంత్ ఈ విషయం చెప్పకపోవడం గమనార్హం. దీంతో రుణమాఫీని కాంగ్రెస్ ప్ర భుత్వం పక్కకు పెట్టినట్టేననే సంకేతాలు జారీ చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
రుణమాఫీ ఎలా పూర్తయినట్టు?
సర్కారు లెక్కల ప్రకారం 42 లక్షల మంది రైతులకు రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేయాలి. కానీ, ఇప్పటివరకు ప్రభుత్వం నాలు గు విడతల్లో 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసింది. ఈ లెక్కన ఇంకా 16.65 లక్షల మం ది రైతులకు రూ.10,384 కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉన్నది. లక్షల మంది రైతులకు రూ.వేల కోట్లు పెండింగ్‌లో ఉండగా రుణమాఫీ పూర్తయినట్టు ఎలా అవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చివరి విడత రుణమాఫీ పూర్తి చేసినట్టు చెప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రుణమాఫీ చేయాల్సింది రూ.31వేల కోట్లు కాగా రూ.20 వేల కోట్లు మాఫీ చేసి.. మొత్తం పూర్తయిందని ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
31 వేల కోట్లు కాదు.. అది బ్యాంకుల తప్పు
రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవసరమవుతాయని సీఎంతోపాటు మంత్రులు అనేకసార్లు చెప్పారు. కానీ, సీఎం ఇప్పుడు మాట మార్చేశారు. ఈ మేరకు ఆదివారం మీడియా సమావేశంలో ‘రుణమాఫీకి తొలుత రూ.31 వేల కోట్లు అవసరమని చెప్పారు. ఇప్పుడేమో రూ.20 వేల కోట్లు మాఫీ చేసి పూర్తయిందని అంటున్నారు. ఇదెలా సాధ్యం. నిధులెందుకు తగ్గాయి?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా.. సీ ఎం స్పందిస్తూ.. ‘బ్యాంకర్లు 2014 నుంచి రై తులకు ఉన్న మొత్తం రుణాల వివరాలను కలిపేశారు. రైతు లు తీసుకునే లాంగ్‌టర్మ్ రుణాలను ఇందులో కలిపేశారు. అందుకే వారు ప్రాథమికంగా రూ.31 వేల కోట్లు అని లెక్క చెప్పారు. ఆ తర్వాత మేము నిర్ధిష్ట ఫార్మాట్ ఇచ్చాక ఈ లెక్క మారింది’ అని సీఎం వివరించారు. తద్వారా రుణమాఫీకి వాస్తవంగా కావాల్సిన రూ.31 వేల కోట్లను 20 వేల కోట్లకు తగ్గించడం గమనార్హం.
అప్పుడే పూర్తయితే నాలుగో విడతెందుకు?
ఆగస్టు 15 నాటికి మూడు విడతల్లో రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రూ.2 లక్షలలోపు రైతులందరికీ రుణమాఫీ పూర్తయినట్టు సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు చెప్తూ వచ్చారు. తాము మాట నిలుపుకొన్నాం కాబట్టి మాజీ మంత్రి హరీశ్‌రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘ఒకవేళ ఆగస్టు 15 నాటికే రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ పూర్తయితే, ఈ నెల 30న మహబూబ్‌నగర్‌లో నాలుగో విడత రుణమాఫీ ఎందుకు చేసినట్టు? 3.13 లక్షల మంది రైతులకు రూ.2,747 కోట్లు ఎందుకు ఇచ్చినట్టు? ఈ లెక్కన కాంగ్రెస్ మాట తప్పినట్టే కదా?
ఇవీ రుణమాఫీ లెక్కలు