Minister Niranjan Reddy | హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ఏ కారణంతోనైనా బ్యాంకు ఖాతాలు క్లోజ్ అయినా, ఖాతా నంబరు మారినా, డీబీటీ ఫెయిలైనా రుణమాఫీ కావాల్సిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, స్తంభించిన ఖాతాలన్నింటికీ రుణమాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశా రు. రుణమాఫీపై జరుగుతున్న తప్పుడు ప్రచా రం, సమస్యలపై మంత్రి శనివారం ఒక ప్రకటనలో స్పందించారు. 2018 డిసెంబర్ 11 నాటికి ప్రతి కుటుంబానికి రూ.లక్ష వరకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం రైతుల రుణ ఖాతాలకు ఈ ని ధుల విడుదల ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. ప్రభు త్వం ప్రకటించిన విధంగా నిర్దేశి త సమయంలో రుణమాఫీ ప్రక్రి య పూర్తవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం 16,65,656 మంది రైతుల ఖా తాలకు రూ.8089.74 కోట్లను విడుదల చేసిందని వివరించారు. 2018 డిసెంబర్ 11 వరకు రూ.లక్ష, ఆపైన ఎంత వరకు రుణాలు ఉన్నా ఆయా రైతు కుటుంబాలకు రుణమాఫీ ప్రక్రియ వర్తిస్తుందని పేర్కొన్నారు. అయితే రుణమాఫీ పథకం కింద అర్హులైన రైతుల డాటాబేస్ 2020 సంవత్సరంలో తయారు చేసిందని, బ్యాంకుల విలీనం మూలంగా ఈ విషయంలో రైతుల ఖాతాల వివరాలు మారడంతో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు.
అమెరికా ఫార్మ్ప్రోగ్రెస్ షోకు మంత్రి నిరంజన్‌రెడ్డి
అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఫార్మ్ ప్రోగ్రెస్ షో (వ్యవసాయ ప్రగతి ప్రదర్శన)కు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ నెల 29 నుంచి 31 వరకు అమెరికాలోని ఇల్లినాయిస్ డెకాటూర్లో ఈ ప్రదర్శన జరుగనున్నది. ఈ ప్రదర్శన ఆహ్వానంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో వ్యవసాయానికే మొదటి ప్రాధాన్యమని స్పష్టం చేశారు.