కడ్తాల్, నవంబర్ 30 : రుణమాఫీ కాని రైతులు వినూత్న నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ శనివారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో రుణమాఫీ దక్కని రైతులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి సెల్ఫీలు దిగారు. ఈ ఫొటోలను బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డికి ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథ్‌నాయక్ మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఇంకా చాలామంది రైతులకు రుణం మాఫీ కాలేదని, రైతుల ఖాతాల్లో రైతు భరోసా పడలేదని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ఏం సాధించారని విజయోత్సవాలు చేసుకుంటున్నారని నిలదీశారు.