హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): తాత్కాలిక డీజీపీల నియామకంపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మిగతా ఏడు రాష్ర్టాలతోపాటు తెలంగాణ కూడా డీజీపీ హోదా ఉన్న అధికారుల వివరాలను సిద్ధం చేసినట్టు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా తాతాలిక డీజీపీలను నియమించిన ఎనిమిది రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కోర్టు ధికరణ నోటీసులను జారీచేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు నిబంధనలకు విరుద్ధంగా తాతాలిక డీజీపీలను నియమించాయంటూ హర్యానాకు చెందిన వినోద్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టి.. ధిక్కార నోటీసులు ఇచ్చింది. ఈ నెల 21లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
డీజీపీ పోస్టు ఖాళీ అవడానికి మూడు నెలల ముందే యూపీఎస్సీ చై ర్మన్ అధ్యక్షతన ఉండే కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం సీనియారిటీ ప్రకారం పేర్ల ను పంపించాలి. కనీసం ఆరు నెలల స ర్వీసు ఉన్న డీజీ ర్యాంకు అధికారులందరి జాబితాను పంపాలని, మెరిట్, సీ నియారిటీ ఆధారంగా ముగ్గురి పేర్ల ను కమిటీ ఖరారు చేస్తుందని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఇందులో ఒకరిని డీజీపీగా నియమించాల్సి ఉంటుంది.