Arudra wife : దివంగత సినీ గేయ రచయిత ఆరుద్ర సతీమణి, ప్రముఖ పాత్రికేయురాలు కె.రామలక్ష్మి (92) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మలక్పేట్ అస్మాన్గడ్లోని తన ఇంటిలో శుక్రవారం మధ్యాహ్నం 1.05గంటలకు తుది శ్వాస విడిచారు. 1930 డిసెంబర్ 31న కోటనందూరులో జన్మించిన రామలక్ష్మి మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టా పొందారు.
1951లోనే సాహిత్య రంగంలోకి అడుగుపెట్టారు. ఆంగ్లం, ఆంధ్ర సాహిత్యం, ప్రాచీనాంధ్ర సాహిత్యాన్ని ఆమె అవపోసాన పట్టారు. తెలుగు స్వతంత్రలో ఇంగ్లీషు విభాగానికి ఉప సంపాదకురాలిగా పనిచేస్తూనే, అనువాదాలు సైతం చేసేవారు. మహిళా సంక్షేమ సంస్థల్లో కూడా రామలక్ష్మి పని చేశారు. 1954లో కవి, సాహిత్య విమర్శకుడు, సినీ రచయిత ఆరుద్రతో పెండ్లి జరిగింది. ఆ తర్వాత ‘రామలక్ష్మి ఆరుద్ర’ కలం పేరుతో కూడా అనేక రచనలు చేశారు. వీరికి ముగ్గురు కూతుర్లు.