సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ) /సైదాబాద్: ప్రముఖ రచయిత్రి డాక్టర్ కే రా మలక్ష్మి (92) వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. 1930 డిసెంబర్ 31న తూర్పుగోదావరి జిల్లా కోటనందూరులో జన్మించిన రామలక్ష్మి మద్రాసు విశ్వవిద్యాల యం నుంచి బీఏ పట్టా పొందారు. 1951లో నే సాహిత్య రంగంలో అడుగుపెట్టారు. తెలుగు స్వతంత్రలో ఇంగ్లిష్ విభాగానికి సంపాదకురాలిగా పని చేశారు. మహిళా సంక్షేమ సంస్థలకు సేవలందించారు. 1954లో ప్రముఖ కవి, సా హిత్య విమర్శకుడు, సినీ రచయిత ఆరుద్రను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ‘రామలక్ష్మి ఆరుద్ర’ కలం పే రుతో రచనలు, అనువాదాలు చేశారు. వీరికి ముగ్గురు కూతుళ్లు.
కే రామలక్ష్మి రాసిన మొదటి నవల ‘విడదీసే రైలు బళ్లు’.‘కరుణ కథ’, ‘లవంగి’, ‘నీదే నా హృదయం’, ‘ఒక జీవికి స్వేచ్ఛ’ కథా సంపుటిలాంటి ఎన్నో రచనలు ఆమెకు పేరు తెచ్చాయి. మద్రాస్ వర్సిటీ నుంచి మహిళలకు ఇచ్చే అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డు ‘గృహలక్ష్మి స్వర్ణ కంకణం’ రామలక్ష్మిని వరించింది. నంది అవార్డు కూడా వచ్చిం ది. జీవనజ్యోతి సినీ రచనకు మొదటి ఫిమేల్ జర్నలిస్ట్‌గా పేరుతెచ్చుకున్నారు. అనంతరం ‘ఆరుద్ర సినీగీతాలు’ సంపుటాలను రామల క్ష్మి వెలువరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ‘నారీ దృక్పథం’ పబ్లికేషన్‌కు అవార్డు వచ్చింది. అంతే కాకుండా పలు అంతర్జాతీయ సంస్థలతో కలిసి రామలక్ష్మి పనిచేశారు. సెన్సార్ బోర్డు మెంబర్‌గా కూడా రామలక్ష్మి కొంతకాలం సేవలందించారు.
రచయిత్రిగా, జర్నలిస్టుగా రామలక్ష్మి సాహితీవేత్తలకు సుపరిచితమేనని తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, నాళేశ్వరం శకంరం, తిరునగరి ఉడయవర్లు లాంటి ప్రముఖులు పేర్కొన్నారు. ఆమె జీవితాంతం ముక్కుసూటి మనిషిగానే కొనసాగారని, నిజాలు నిర్భయంగా వెల్లడించిన మొదటి తరం మహిళా రచయిత్రి అస్తమించటం సాహితీలోకానికి తీరని లోటని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లోని శ్మశానవాటికలో రామలక్ష్మి అంత్యక్రియలు నిర్వహించారు.