Telangana | హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఎక్సైజ్‌శాఖ సాఫ్ట్వేర్ రెండ్రోజులుగా మొరాయిస్తున్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 19 డిపోల నుంచి దుకాణాలకు వెళ్లాల్సిన మద్యం సరఫరా నిలిచిపోయింది. రెండ్రోజులుగా ‘సీటెల్’ ప్రతినిధులు రంగంలోకి దిగి సమస్యను చక్కదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో చేసేది లేక మ్యానువల్‌గా మద్యం సరఫరా చేస్తున్నారు. అయితే, ఇప్పటికే ఎంతోమంది వందల కోట్ల మద్యానికి డీడీలు సైతం కట్టారు. మంగళవారం సాయంత్రానికే సమస్య పరిష్కారమవుతుందని భావించినా.. నిపుణులు చేతులెత్తేయడంతో బుధవారం కూడా కొలిక్కిరాలేదు. గురువారం కూడా ఇదే పరిస్థితి ఉంటే.. మరిన్ని ఇబ్బందులు తలెత్తవచ్చని ఎక్సైజ్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.