హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగా ణ): రాష్ట్రంలోని 5 జిల్లాల్లో భారీగా సున్నపురా యి (లైమ్‌స్టోన్), గ్రానైట్ నిల్వలు ఉన్నట్టు తె లంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) గు ర్తించింది. సూర్యాపేట, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లో సున్నపురాయి గనులు.. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వివిధ రకాల గ్రానైట్ నిల్వలు ఉన్నట్టు వెల్లడించింది. ఈ గనుల తవ్వకానికి అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు, మఠంపల్లి, రఘునాథపాలెం, రామాపుర, దొండపాడు, నల్లగొండ జిల్లాలోని దామరచెర్ల, వికారాబాద్ జిల్లాలోని జివాంగి, మల్కాపూర్ ప్రాంతాల్లో 276.83 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సున్నపురాయి నిల్వలు ఉన్నట్టు గు ర్తించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇ ల్లందు, ఖమ్మం జిల్లాలోని కొత్తగట్టు, తాళ్లపూసపల్లె, నమిలికొండ, వెంతడుప్ల తదితర ప్రాం తాల్లో 83.23 హెక్టార్లలో ఎరుపు, నలుపు, తె లుపు, బ్రౌన్ గ్రానైట్‌ను గుర్తించింది. ఈ 4 రకాల గ్రానైట్ 28,400 క్యూబిక్ మీటర్లలో విస్తరించి ఉన్నట్టు నిర్ధారించింది. రాష్ట్రంలో కొత్త మైనింగ్ లీజులపై 2022 మార్చి నుంచి నిషే ధం అమల్లో ఉండటంతో మైనింగ్‌కు అనుమతించడంలేదు. గతంలో మంజూరైన లీజులకు మాత్రమే రెన్యూవల్స్, ట్రాన్స్ఫర్స్ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా సున్నపురా యి, గ్రానైట్ గనులను గుర్తించిన ప్రాంతాల్లో మైనింగ్‌కు అనుమతిస్తే ప్రభుత్వానికి మరింత ఆదాయం వస్తుందని టీజీఎండీసీ చెప్తున్నది.
ప్రస్తుతం 70 వేల హెక్టార్లలో మైనింగ్
ప్రస్తుతం రాష్ట్రంలో అన్నిరకాల గనుల్లో కలి పి దాదాపు 70 వేల హెక్టార్లలో మైనింగ్ జరుగుతున్నది. బొగ్గు లాంటి మేజర్ మైనింగ్స హా గ్రానైట్, రోడ్ మెటల్, సున్నపురాయి, క్వార్ట్, ఫెల్డ్‌స్పార్ తదితర మైనర్ మినరల్స్‌కు సంబంధించిన 2,500 లీజుల్లో సుమారు 700 లీజు లు యాక్టివ్‌గా లేవు. మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి ఏటా దాదాపు రూ.5,500 కోట్ల ఆదాయం సమకూరుతున్నది. ఇందులో సింగరేణి నుంచి అధికంగా రూ.2,900 కోట్లు, ఇసుక ద్వారా రూ.675 కోట్లు వస్తున్నాయి. మిగిలిన ఆదా యం గ్రానైట్, రోడ్ మెటల్, సున్నపురాయి, క్వార్ట్, ఫెల్డ్‌స్పార్ ద్వారా సమకూరుతున్నది.