Rain alert | హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారం నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, కామారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసింది.
శుక్రవారం భద్రాద్రి -కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, యాద్రాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షం పడనున్నది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని పేర్కొన్నది.