జూలై 3 వరకు తేలికపాటి వర్షాలు
జూలై 3వ తేదీ వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.
- పలు జిల్లాల్లో నేడు ఉరుములు, మెరుపులతో వాన
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): జూలై 3వ తేదీ వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ ఒడిశా తీరం వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నదని తెలిపింది.
మరోవైపు దేశమంతటా విస్తరించిన నైరుతి రుతుపనాల షీర్ జోన్ బుధవారం బలహీన పడినట్లు పేర్కొన్నది. దీని ప్రభావంతో రాష్ట్రంతో వర్షం తీవ్రత తగ్గి తేలిక పాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా గడిచిన 24 గంటల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా మినహా అన్ని జిల్లాల్లోనూ వర్షాలు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్, సంగారెడ్డి, నారాయణపేట, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి.
గడిచిన 14 గంటల్లో అత్యధికంగా వర్షం కురిసిన ప్రాంతాలు

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

