TS Weather | హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): సెగలు కక్కుతున్న ఎండలతో ఉక్కిరి బిక్కిరవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లని ముచ్చట చెప్పింది. రాష్ట్రంలో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలి పింది. కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వానలు అక్కడక్కడా పడతాయని, గురువారం పొడి వాతావరణం నెలకొంటుందని ప్రకటించింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్, వికారాబాద్, మెదక్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.