నందిపేట్, డిసెంబర్ 25: బీఆర్ఎస్ హయాంలోనే ఎత్తిపోతల పథకాలను మంజూరు చేశామని, రైతుల చిరకాల వాం ఛ మచ్చర్ల లిఫ్ట్ కేసీఆర్ గిఫ్ట్ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. మచ్చర్ల లిఫ్ట్ పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గానికి మంజూరైన మూడు కొత్త లిఫ్ట్‌లు బీఆర్ఎస్ ఇచ్చినవేనని స్పష్టంచేశారు. మచ్చర్ల, జోధ్‌పూర్, ఖుద్వాన్పూర్ రైతులకు చెందిన 2,860 ఎకరాల భూమిని సాగులోకి తెచ్చేందుకు మచ్చర్ల ఎత్తిపోతల పథకానికి రూ.40 కోట్లు, ఫత్తేపూర్, చేపూర్, సుర్బిర్యాల్ ఎత్తిపోతల పథకానికి రూ.110 కోట్లు, చిక్లీ-గుంజిలి లిఫ్ట్‌కు రూ.89 కోట్లను తానే మంజూరు చేయించానని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీజేపీ ఆర్మూర్ పాలిట అష్టదరిద్రాలుగా మారాయని మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే తెచ్చిన నిధులు నిల్, కాంగ్రెస్ నేత అవినీతి ఫుల్, ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కిల్ అని ధ్వజమెత్తారు.