నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు ఆదివారం ఎగువ నుంచి 1,22,492 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్టు నుంచి 1,31,098 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. సాగర్ డ్యాం 10 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీ) కాగా ప్రస్తుతం 589.80 అడుగుల (311.4474 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉన్నది.
– నందికొండ