Weather Update | కాసేపట్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల సిద్దిపేట జిల్లాలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. హన్మకొండ, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మంచిర్యాల, మెదక్, నల్గొండ, పెద్దపల్లి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి, ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఇక తెలంగాణలో రాబోయే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.