గుర్రంపోడ్ : నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ( ZP School ) పూర్వవిద్యార్థుల ( Alumni ) సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 2003-04లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం ధర్వేశ్పురంలోని రేణుక ఎల్లమ్మ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు.
22 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులందరూ కలుసుకొని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాలు మంచికంటి కృష్ణయ్య, ఉపాధ్యాయులు క్రిష్ణారెడ్డి, చామకూరి లింగారెడ్డి, ఇడుకుళ్ల వెంకటేశ్వర్ల గుప్తా, మహ్మద్ హసన్ కలీం, కవిత, వద్దిరెడ్డి నర్సింహ్మరెడ్డి, రావుల వెంకటనారయణ గౌడ్‌ను సన్మానించారు.ఈ సందర్భంగా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వారు చేస్తున్న ఉద్యోగాలు, కుటుంబ వివరాలను ఒకరినొకరు పంచుకున్నారు.