నందికొండ/మెండోరా, సెప్టెంబర్ 4: నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు ఆదివారం శ్రీశైలం నుంచి 1,75,723 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగగా.. ప్రాజెక్టు నుంచి 1,75,723 క్యూసెక్కుల నీరు బయటకు విడుదలవుతున్నది. అధికారులు 16 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 (312 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం 589.20 (309.9534 టీఎంసీలు) అడుగులుగా ఉన్నది. గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నదని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటిమట్టం 1090.80 అడుగుల (89.212 టీఎంసీలు) నీటి నిల్వ ఉన్నది.