ధర్మారం/రామడుగు, ఆగస్టు 16: కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లోని నంది, గాయత్రి పంప్‌హౌస్‌లో నీటి ఎత్తిపోతలు కొనసాగుతుండగా మధ్యమానేరుకు జలాలు వడివడి గాతరలుతున్నాయి. 13న పెద్దపల్లి జిల్లా ధ ర్మారం మండలం నందిమేడారంలోని నంది పంప్‌హౌస్‌లో 3 మోటర్లను ఆన్‌చేసి 9,450 క్యూ సెక్కుల చొప్పున నీటిని ఎత్తిపోయించా రు. శనివారం 2, 4, 6 మోటర్లతో పంపింగ్ కొనసాగించారు. డెలివరీ సిస్టర్న్‌ల ద్వారా గోదావరి జలాలు ఎగిసిపడుతూ నంది రిజర్వాయర్‌లోకి చేరుకుంటున్నాయి. నంది రిజర్వాయర్ ప్రధాన గేట్ల ద్వారా అదే పరిమాణంలో గ్రావిటీ కాల్వ ద్వారా వెళ్లి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయ త్రి పంప్‌హౌస్‌కు సరఫరా అవుతున్నది. నాలుగు రోజుల నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. 13న ఉదయం 8:30 గంటలకు 1, 2, 4 బాహుబలి మోటర్లను ప్రారంభించిన అధికారులు సాయంత్రం 5:30కు నిలిపివేశారు. తిరిగి 14న, 15న ఆ మూడు మోటర్లను ఆన్ చేసి, 9,450 క్యూసెక్కుల నీటిని సిరిసిల్ల జిల్లాలోని మిడ్‌మానేరుకు తరలించారు. శనివారం సైతం అవే మోటర్లను నడిపించిన అధికారులు, 5,6 నంబర్ మోటర్లను ట్రయల్న్ చేసుకున్నట్టు తెలిపారు. సాయంత్రం వరకు మిడ్‌మానేరుకు 2 టీఎంసీల జలాలను తరలించినట్టు పేర్కొన్నారు.