లాంగ్ డ్రైవ్‌తో నెమ్మదిస్తున్న మెదడు పనితీరు.. జాగ్రత్తలతో అధిగమించవచ్చంటున్న నిపుణులు
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): కండ్లు రోడ్డును చూస్తూనే ఉంటాయి. చేతుల్లో స్టీరింగ్ ఆడుతూనే ఉంటుంది. కానీ, డ్రైవింగ్‌పై నియంత్రణ తప్పుతుంది. ఎదురుగా వస్తు న్న వాహనాలు, ముందు వెళ్తున్న వాహనాలు, రోడ్డు హద్దులు ఇలా వేటినీ మెదడు రిజిస్టర్ చేయదు. ఫలితంగా రోడ్డు ప్రమాదం జరిగి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. దీన్నే రోడ్ హిప్నోసిస్ అంటారు. లాంగ్ డ్రైవ్ చేసే వారిలో ఈ రకమైన స్థితి ఉత్పన్నమవుతున్నదని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
రెండున్నర గంటల తర్వాత ప్రారంభం
డ్రైవర్ రోడ్డుపైకి వచ్చిన రెండున్నర గంటల తర్వాత రోడ్ హిప్నోసిస్ ప్రారంభమవుతుంది. మెదడు ఆధీనంలో ఉండ దు. ఆలోచనలపై అదుపు తప్పుతుంది. దీంతో ముందు వాహనాలు ఉన్నాసరే డ్రైవర్ అదే వేగంతో వెళ్లి ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది. భారీ ప్రమాదం జరిగినా డ్రైవర్‌కు ఆ విషయాలేవీ గుర్తుండవు. రోడ్ హిప్నోసిస్ రాత్రిపూట ఎకువగా జరుగుతుంది. హైవేల్లో ఒకే తరహా లైన్లు, రేడియం స్టిక్కర్లు, విశాలంగా ఉండే రోడ్లు, పరిసర ప్రాంతాలు కనిపించకపోవడం ఈ స్థితికి కారణమవుతున్నాయి.
ఇలా చేస్తే హిప్నోసిస్ నుంచి బయటపడొచ్చు