హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తేతెలంగాణ) : చండ్ర రాజేశ్వర్‌రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం కొండాపూర్‌లోని నీలం రాజశేఖర్‌రెడ్డి రిసెర్చ్ సెంటర్లో సీపీఐ మాజీ జాతీయ ప్రధా న కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణసభ జరిగింది. ఈ సందర్భంగా రిసెర్చ్ సెంటర్లో సురవరం సుధాకర్‌రెడ్డి పేరుతో ఏర్పాటుచేసిన గ్రంథాలయం లోగోను తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి ఆ వుల మంజులత ఆవిష్కరించగా, గ్రంథాలయాన్ని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చై ర్మన్ రియాజ్ ప్రారంభించారు.
మావోయిస్టు కేంద్ర కమిటీ నివాళి
సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్‌రెడ్డి మృతిపై మావోయిస్టు కేంద్ర కమిటీ నివాళి అర్పించింది. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఆయన జీవితాంతం వామపక్ష రాజకీయాలకు, పీడిత ప్రజల సమస్యలపై పోరాటానికి కట్టుబడి ఉన్నారని కొనియాడింది. ఉమ్మడి ఏపీలో బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా తన గళం వినిపించారని గుర్తుచేసింది. ఆయన మృతి సీపీఐకి తీరని లోటని పేర్కొన్నది.