హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో లైబ్రరీలను ఏర్పాటుచేసి లైబ్రేరియన్లను నియమించాలని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళికి తెలంగాణ లైబ్రరీ సైన్స్ స్టూడెంట్స్, నిరుద్యోగుల సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలోని ఉన్నత పాఠశాలలు, మోడల్ సూల్స్, కేజీబీవీలు, గురుకుల పాఠశాలలు, వివిధ ప్రభుత్వ కళాశాలలు, ఐటీఐ కళాశాలలు, సాంకేతిక కళాశాలలు, మెడికల్ కళాశాలలు, వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీలుగా ఉన్న లైబ్రేరియన్, వాటి అనుబంధ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. గురువారం హైదరాబాద్లో ఆకునూరి మురళికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సభ్యులు ఆకుల సాయిలు, గిరి, మంజుల, రాధాకృష్ణ, బాబురామ్, ప్రశాంత్ పాల్గొన్నారు.