LHPS | కేశంపేట, ఏప్రిల్ 2 : ఎల్‌హెచ్‌పీఎస్(లంబాడి హక్కుల పోరాట సమితి) రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్ నాయక్‌ను కేశంపేట పోలీసులు బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. మండల పరిధిలోని ఎక్లాస్‌ఖాన్‌పేట గ్రామ సమీపంలోగల ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు అరెస్టు చేసి కేశంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాష్ట్ర కేబినెట్లో లంబాడీ ఎమ్మెల్యేలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి ఎల్‌హెచ్‌పీఎస్ పిలుపునివ్వడంతో రాంబల్ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గంలో లంబాడీలకు స్థానం కల్పించాలని కోరడమే పాపమైందని, రాష్ట్రవ్యాప్తంగా లంబాడీలను అరెస్టులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన గిరిజనులను వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.