హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కైనా నాటి 2022కు స్వాగతం పలుకుదామని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ పిలుపునిచ్చారు. జీవులకు జీవనాధారం చెట్లు.. కొత్త సంవత్సరంలో కొత్త ఆశను పెంచుదామంటూ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2021లో మొక్కలు నాటిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు.