కరోనా విజృంభిస్తున్న వేళ.. అందరి జాగ్రత్తలూ దీనిపైనే. అందరి మాటలూ వీటిని పెంచుకోవడం ఎలా అనేదానిపైనే. ఆక్సిజన్ మన శరీర కణాల్లో శక్తిని పెంచుతుంది. తద్వారా రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. దీనికి బలవర్ధకమైన ఆహారం తీసుకోవడమే మార్గం. రెడ్ బ్లడ్ సెల్స్ (ఆర్బీసీ)లోని ప్రధాన ప్రొటీన్ హిమోగ్లోబిన్. ఇది ఊపిరితిత్తులనుంచి ఆక్సిజన్ (ఓ2)ను వివిధ శరీర అవయవాలకు సరఫరా చేయడంతోపాటు అక్కడినుంచి కార్బన్‌డైయాక్సైడ్ (సీఓ2)ను వెనక్కు తీసుకొని వస్తుంది. ఈ ఆక్సిజన్ కణాల్లో శక్తిని తయారుచేసేందుకు తోడ్పడుతుంది. అందుకే శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ సరిగ్గా ఉంచుకోవాలనుకుంటే హిమోగ్లోబిన్‌ను పెంచే ఆహార పదార్థాలు తినడం ఎంతో ముఖ్యం. పురుషులకు సుమారు 13.5 గ్రాములు/ డెసీ లీటర్లు, మహిళలకు 12 గ్రాములు/ డెసీ లీటర్ల హిమోగ్లోబిన్ అవసరమని డాక్టర్లు చెప్తున్నారు. హార్వర్డ్ హెల్త్, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. శరీరంలో హిమోగ్లోబిన్ తగినంత పాళ్లలో మెయింటెయిన్ చేయాలంటే కాపర్, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ బీ2 (రైబోఫ్లెవిన్), విటమిన్ బీ3 (నియాసిన్), విటమిన్ బీ5, విటమిన్ బీ 6, ఫాలిక్ యాసిడ్, విటమిన్ బీ12 తీసుకోవడం తప్పనిసరి. ఆహారంలో ఈ న్యూట్రియెంట్స్ ఉండటం వల్ల రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి.
కాపర్
విటమిన్ బీ6, బీ9, బీ12
విటమిన్ బీ2 (రైబోఫ్లెవిన్)
కోడిగుడ్లు, ఆర్గాన్ మీట్ (కిడ్నీ, లివర్), పాలు తదితరాల్లో అధిక పాళ్లలో ఉంటుంది.
90 గ్రాముల లివర్ తీసుకుంటే రోజుకు కావాల్సిన రైబోఫ్లెవిన్లో 223% పొందవచ్చు.
ఓట్స్, పెరుగు, పాలు, బాదాం, పనీర్, పొట్టుతో కూడిన యాపిల్, బీన్స్, సన్‌ఫ్లవర్ గింజలు, టమాట తదితరాలు తీసుకున్నా రైబోఫ్లెవిన్ లభిస్తుంది.
ఐరన్..
మేక, బాతు, కోడి తదితర మాంసంలో తగినంత ఐరన్ లభిస్తుంది.
180 గ్రాముల మాంసంలో ఒక రోజుకు కావాల్సిన ఐరన్‌లో సుమారు 52% లభిస్తుంది.
బీన్స్, ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, పప్పు, బఠాణీ గింజలు తదితరాల్లో కూడా ఐరన్ ఉంటుంది.ఒక కప్పు పప్పు తీసుకుంటే 100% ఐరన్ అవసరాన్ని తీర్చుకోవచ్చు
విటమిన్ బీ5
ఆర్గాన్ మీట్ (లివర్), చికెన్, టూనా చేప, కోడిగుడ్లు తదితర మాంసాహార పదార్థాల్లో విటమిన్ బీ5 అధికంగా లభిస్తుంది.
90గ్రాముల ఆర్గాన్ మీట్లో రోజువారీ అవసరాల్లో 166% వరకు విటమిన్ బీ5 లభిస్తుంది.
పుట్టగొడుగులు, పొద్దు తిరుగుడు గింజలు, ఆలుగడ్డ, పెసరపప్పు, బ్రౌన్‌రైస్, బ్రోక్లీ, ఓట్స్, పనీర్ తదితరాల్లో 8-52శాతం వరకు విటమిన్ బీ5 లభిస్తుంది.
విటమిన్ ఏ
విటమిన్ బి3 (నైసిన్)
శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పుష్కలంగా ఉండాలంటే కావలసిన న్యూట్రియెంట్స్
ఇవీ కూడా చదవండి…
రాజకీయ సన్యాసానికి సిద్ధం : మంత్రి ఈటల