కరోనాకు తండా సవాల్

- మహారాష్ట్రకు కూతవేటు దూరంలో ఉన్నా నేటికీ ఒక్క కేసు లేని పల్సి గ్రామం
- పక్కాగా కొవిడ్ నిబంధనలు అమలు
- ఏడాది కాలంగా శుభకార్యాలకు దూరం
- వేపచెట్లే రక్షణ అంటున్న గ్రామస్థులు
కుభీర్, ఏప్రిల్ 28 : కరోనా మహమ్మారితో దేశమంతా వణికిపోతున్న తరుణంలో నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పల్సితండా ఒక్క కేసు లేకుండా ఔరా అనిపిస్తున్నది. నిత్యం వేలల్లో కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ.. ఈ గ్రామం కొవిడ్ రక్కసికి చిక్కలేదు. కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలుచేస్తూ ఏడాది కాలంగా శుభకార్యాలకు దూరంగా ఉండటంతోపాటు మంచి ఆహార నియమాలు గ్రామస్థులను కరోనా నుంచి కాపాడుతున్నాయి. గతేడాది నుంచి కరోనా మహమ్మారితో పల్లె నుంచి పట్నందాకా ముప్పుతిప్పలు పడుతున్న సమయంలో ఈ గ్రామం ఒక్క కేసు లేకుండా సురక్షితంగా ఉండటం విశేషం.
స్వచ్ఛ గాలి.. ఆహారపు అలవాట్లు
చుట్టూ గుట్టలు, పచ్చని అడవులు ఉన్న పల్సితండాలో 150 కుటుంబాలు, 680 మంది జనాభా ఉన్నారు. ఉదయం 4 గంటలకే మహిళలు, పురుషులు వ్యవసాయ పనులకు వెళ్లి.. 10 గంటలకు తిరిగొస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చెట్ల కింద సేదతీరి మళ్లీ పనులకు వెళ్తారు. ఉదయం చాయ్‌కు బదులు డికాషన్ తీసుకుంటారు. టిఫిన్ సమయంలో వేడివేడి జొన్న అంబలి తాగుతారు. ఆకు కూరలు, దుంపలు, పప్పు దినుసులు, చింతపూత, ఇప్పపువ్వు ఆహారంగా తీసుకుంటారు. అడవిలో దొరికే సీజనల్ పండ్లు తింటారు. అడవిలో లభించే పోషకాలతో కూడిన పండ్లు తీసుకుంటారు. గ్రామంలో వందకుపైగా ఉన్న వేప చెట్ల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం, పుష్టికరమైన భోజనం తీసుకోవడం వల్లనే తమ గ్రామానికి కరోనా రాలేదని గ్రామస్థులు చెబుతుండటం గమనార్హం.
నిత్యం శానిటైజేషన్..
కరోనాను ఎదుర్కొవాలంటే కఠినమైన నిబంధనలు పాటించాలని గ్రామస్థులు భావించారు. అందరూ ఏకమై గ్రామంలో నిత్యం శానిటైజేషన్ చేసేలా తీర్మానం చేసుకున్నారు. ఈ మేరకు పంచాయతీ సిబ్బంది ప్రతి వీధిలో శానిటైజేషన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరిస్తున్నారు. సామగ్రి తెచ్చుకునేందుకు పది కుటుంబాల తరఫున ఒక్కరే వెళ్తున్నారు. యేడాది కాలంగా గ్రామస్థులు శుభకార్యాలకు దూరంగా ఉండటం విశేషం. ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా ఉండటం వల్ల కరోనా సోకకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పక్కాగా నిబంధనల అమలు
ప్రభుత్వం సూచించినట్టు గ్రామస్థులు కొవిడ్ నిబంధనలను పక్కాగా పాటిస్తున్నారు. యేడాది కాలంగా పెండ్లిళ్లు, పేరంటాలకూ దూరంగా ఉంటున్నారు. దీంతోపాటు గరంగరం గంజి, జొన్న అంబలి తాగుతుండటం.. చాయ్‌కి బదులు డికాషన్ తీసుకోవడం కరోనా నుంచి రక్షిస్తుంది. గ్రామంలో పెంచిన వేప చెట్ల కిందే యేడాది కాలమంతా తండా ప్రజలు నిద్రిస్తారు. ఎన్నో రోగాలను ఈ చెట్ల గాలి హరిం చేస్తదని మా నమ్మకం.
- జాదవ్ తిత్రీబాయి, సర్పంచ్
రోజూ శానిటైజ్ చేస్తున్నాం..
గ్రామంలో తరచూ శానిటైజ్ చేస్తున్నాం. కరోనా నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. కొవిడ్ నేపథ్యంలో గ్రామంలోకి ఎవరినీ అనుమతించట్లేదు. ప్రత్యేక పరిస్థితుల్లో మాస్కు ధరించి రావాలని, దూరంగా ఉండి మాట్లాడాలని చెబుతున్నాం. శుభకార్యాలకు వెళ్లడం మానుకున్నారు. ఇలా కట్టుబాట్లను పాటించడంతో కరోనా దరిచేరలేదు. - డీ రాజన్న, పంచాయతీ కార్యదర్శి
ఇవీ కూడా చదవండి…
వైరస్ చైన్ ను బ్రేక్ చేయడమే విరుగుడు : ఎయిమ్స్ చీఫ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

