KCR | జయశంకర్ స్ఫూర్తితో పోరాడుదాం.. కేసీఆర్ పిలుపు
KCR | ‘గడచిన రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు గాడితప్పుతున్నాయి. ఆయన ఆశయాల సాధనకు, ప్రమాదంలో పడిన తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టుకొనేందుకు సార్ స్ఫూర్తితో ముందుకు సాగుదాం’ అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు.
KCR | హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ‘గడచిన రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు గాడితప్పుతున్నాయి. ఆయన ఆశయాల సాధనకు, ప్రమాదంలో పడిన తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టుకొనేందుకు సార్ స్ఫూర్తితో ముందుకు సాగుదాం’ అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక తెలంగాణ బిడ్డ ఉద్యమ స్ఫూర్తిని పుణికి పుచ్చుకొని, ఆస్తిత్వ పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం ఆసన్నమైందని, తెలంగాణ గరిమను, సామాజిక, రాజకీయ అస్తిత్వాన్ని నిరంతరం కాపాడుకోవడమే.. జయశంకర్ సార్‌కి మనమిచ్చే ఘన నివాళి అని పునరుద్ఘాటించారు.
ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకొన్న కేసీఆర్.. ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. బాల్యం నుంచే తెలంగాణ అస్తిత్వం కోసం, సామాజిక రాజకీయ చైతన్యంతో ఆలోచనలు చేస్తూ, అందుకు తగ్గ భావజాల వ్యాప్తిని కొనసాగించిన నిస్వార్థ మేధావి, తెలంగాణ స్వాప్నికుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కేసీఆర్ కొనియాడారు. రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమాన్ని తాను ముందుకు తీసుకుపోయే క్రమంలో తన ఆలోచనలకు దిక్సూచిగా ఆయన నిలిచారని గుర్తు చేశారు. రాష్ట్ర సాధన పోరాటంలో తనకు సైద్ధాంతిక మార్గదర్శిగా నిలిచారని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

