దోమలపెంట, నవంబర్ 9 : నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట, ఈగలపెంట పరిధిలో కొన్ని రోజులుగా చిరుతపులి సంచరిస్తున్నది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రెండ్రోజుల కిందట దోమలపెంటలో జెన్కో కార్మికురాలైన రూప ఇంట్లోకి చొరబడి పెంపుడు కుక్కను చంపింది.
ఈ విషయాన్ని స్థానికులు ఫారెస్ట్ రేంజర్ గురుప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా.. చిరుత తిరిగే ప్రదేశాలు గుర్తిస్తామని హామీ ఇచ్చారు. కాగా, బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు మేరకు ఫారెస్ట్ అధికారులు రోడ్డుకు ఇరువైపులా ఉన్న కంపచెట్లను తొలగించారు.