రేవంత్‌రెడ్డీ.. మేడిగడ్డపై రాద్ధాంతం వద్దు
రేవంత్‌రెడ్డి..మీ అన్నదమ్ములే (డీకే శివకుమార్, చంద్రబాబు) కొట్టుకుపోయిన డ్యామ్‌లను మళ్లీ కడుతున్నరు.. మీరు మాత్రం మేడిగడ్డ 2 పిల్లర్ల పేరిట చిల్లర రాజకీయాలు చేస్తున్నరు..’అంటూ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
- మీ చిల్లర రాజకీయం మానుకోండి
- కొట్టుకుపోయిన డ్యామ్లనే మీ అన్నదమ్ములు పునరుద్ధరిస్తున్నరు
- ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ధ్వజం
హైదరాబాద్, జూలై 8 (నమస్తేతెలంగాణ): ‘రేవంత్‌రెడ్డి..మీ అన్నదమ్ములే (డీకే శివకుమార్, చంద్రబాబు) కొట్టుకుపోయిన డ్యామ్‌లను మళ్లీ కడుతున్నరు.. మీరు మాత్రం మేడిగడ్డ 2 పిల్లర్ల పేరిట చిల్లర రాజకీయాలు చేస్తున్నరు..’అంటూ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మేడిగడ్డపై రాద్ధాంతం వద్దంటూ సూచించారు. జూన్‌లో కర్ణాటకలోని హోస్పేట్లో జరిగిన తుంగభద్ర 33 క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవ వేదికపై ఏపీ, కర్ణాటక సీఎంలు చంద్రబాబు, డీకే శివకుమార్‌తో రేవంత్‌రెడ్డి కలిసి ఉన్న ఫొటోని ‘ఎక్స్’లో బుధవారం ఆయన షేర్ చేశారు. కొట్టుకుపోయిన ప్రాజెక్టుల మరమ్మతు విషయంలో వారిద్దరూ వ్యవహరిస్తున్న తీరును పోల్చుతూ సీఎం రేవంత్‌రెడ్డి వైఖరిని ఎత్తిచూపారు.
‘తుంగభద్ర డ్యామ్‌లో 19వ నంబర్ క్రస్ట్‌గేటు కొట్టుకుపోతే ఆయన ఆ ఒక్క గేటుకు ప్యాచ్‌వర్క్ చేసి చేతులు దులుపుకోలేదు. డ్యామ్ భద్రతను దృష్టిలో పెట్టుకొని మొత్తం 33 క్రస్ట్ గేట్లను రూ. 54 కోట్లతో పూర్తిగా మార్చేశారు. రెనొవేషన్ పనులను రికార్డుస్థాయిలో పూర్తిచేసి ప్రాజెక్టును సిద్ధం చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలతో పోలవరం ప్రాజెక్టులోని రూ. 400 కోట్ల విలువైన డయాఫ్రం వాల్ గత ఆగస్ట్ 2020 వరదల్లో కొట్టుకుపోయింది. మరో మీ ప్రియమైన బ్రదర్ చంద్రబాబు అధికారంలోకి రాగానే రూ.వెయ్యికోట్లు వెచ్చించి పునర్నిర్మించారు’ అని గుర్తుచేశారు. ‘కానీ హోస్పేట్లో వారిద్దరూ సోదరులంటూ ఉపన్యాసం దంచిన మీరు (రేవంత్‌రెడ్డి) మాత్రం మేడిగడ్డకు చెందిన 2 పిల్లర్లపై రాజకీయం చేస్తున్నరు.. మరమ్మతు చేతగాక తొక్కుడు రాజకీయం చేస్తూ రైతుల నోట్లో మట్టిగొడుతున్నరు’ అంటూ విమర్శలు గుప్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

