హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ) దేశంలోనే విదేశీ భాషల బోధనకు ఏర్పడ్డ తొలి యూనివర్సిటీ. ఇంతటి ప్రఖ్యాతిగాంచిన వర్సిటీ పరిస్థితి.. నాయకుడు లేని నావలా తయారైంది.
ఏడాది నుంచి ఈ వర్సిటీ వీసీ పోస్టు ఖాళీగా ఉంటున్నది. రెగ్యులర్ వీసీని నియమించకుండా ఇన్‌చార్జీలతో నెట్టుకొస్తున్నారు. ఇఫ్లూ వీసీగా ఉన్న ప్రొఫెసర్ సురేశ్‌కుమార్ పదవీకాలం 2023 డిసెంబర్లో ముగియగా, ప్రస్తుతం ప్రొఫెసర్ హరిబండి లక్ష్మి ఇన్చార్జి వీసీగా కొనసాగుతున్నారు. వీసీ పోస్టు ఖాళీతో వర్సిటీ పాలన గాడితప్పిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.