తాండూర్ : తాండూర్ మండలం మాదారం 3 ఇంక్లైన్ గ్రామపంచాయతీ ఇండిపెండెంట్‌గా గెలిచిన సర్పంచ్ చందనాల రవి కుమార్ ( Ravi Kumar ) ను పార్టీలోకి తీసుకుంటే గాంధీ భవన్ ( Gandhi Bhavan ) ను ముట్టడిస్తామని కాంగ్రెస్ నాయకులు ( Congress Leaders ) హెచ్చరించారు.
ఆ మేరకు కాంగ్రెస్ సర్పంచ్ మద్దతుదారుడిగా పోటీ చేసి ఓడిన పుట్ట శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సూరం రవీందర్ రెడ్డి, ఐఎన్టీయూసీ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షులు పేరం శ్రీనివాస్, సింగిల్ విండో వైస్ చైర్మన్ కాడారీ రత్నాకర్ రావు తదితరులు సమావేశమయ్యారు. నూతన సర్పంచ్ మండలంలోని ఒక నాయకుడి ద్వారా కాంగ్రెస్ పార్టీ లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ ( MLA Gaddam Vinod ) సర్పంచ్‌ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించవద్దని గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కోరారు. కార్యకర్తల మాట వినకుండా ఎమ్మెల్యే గడ్డం వినోద్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తే వందల సంఖ్యలో గాంధీ భవన్ ముట్టడిస్తామని, అవసరమైతే ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్నామని కార్యకర్తలు హెచ్చరించారు.
ఈ కార్యక్రమం లో వార్డు మెంబర్ గొర్లపల్లి కమలాకర్,జాడి చంద్రకళ (తిరుపతి), పుల్లవేణి సాయి కుమార్, మాజీ ఉప సర్పంచ్ రాజ శేఖర్, మాజీ వార్డు మెంబర్ దొంతరవేణి రామచందర్, దర్శనాల సంతోష్, కొండగోర్ల అంజి, గొర్లపల్లి సురేష్, గొర్లపల్లి నరేష్, మీసాల అశోక్, పెరుగు సంతోష్, రెడ్డి కిరణ్, మడావి మాణిక్ రావు ,షేర్ల సాయి, ఎనగందుల రాజు , జాడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.