పెద్ది లేకపోవడం బాధాకరం
తెలంగాణ రాష్ట్ర సాధనలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ముందుండి పోరాడారని, ఆయన లేకపోవడం బాధాకరమని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. నర్సంపేటలో ఏర్పాటు చేసిన పెద్ది విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గమని మండిపడ్డారు. తెలంగాణ పూర్వ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో పెద్ది యాది సభ నిర్వహించారు.
- ఆయన విగ్రహం తొలగించడం దుర్మార్గం
- సుదర్శన్‌రెడ్డి యాది సభలో సిరికొండ
- పాల్గొన్న ఎర్రబెల్లి, వినోద్, దాస్యం తదితరులు
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 2: తెలంగాణ రాష్ట్ర సాధనలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ముందుండి పోరాడారని, ఆయన లేకపోవడం బాధాకరమని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. నర్సంపేటలో ఏర్పాటు చేసిన పెద్ది విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గమని మండిపడ్డారు. తెలంగాణ పూర్వ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో పెద్ది యాది సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిరికొండ మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని సూచించారు. నర్సంపేటలో విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీకి పెద్ది పేరు పెట్టాలని సూచించారు. కాలేజీ ఎదుట, హైదరాబాద్‌లోనూ పెద్ది విగ్రహాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పెద్ది పోషించిన పాత్ర, నర్సంపేట ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. పెద్ది లేకపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో అడ్వకేట్ అబ్దుల్ నబీ, ఎమ్మెల్సీ కోదండరాం, గాదె ఇన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, మార్తినేని ధర్మారావు, తెలంగాణ అర్చక సమాఖ్య గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, ప్రొఫెసర్ పాపిరెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

