కవాడిగూడ, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): మంత్రివర్గంలో మున్నూరుకాపులకు అవకాశం కల్పించాలని మున్నూరుకాపు రాష్ట్ర సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్నూరుకాపు కార్పొరేషన్‌కు రూ. 2వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని కోరుతూ మున్నూరుకాపు రాష్ట్ర సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్నూరుకాపు డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడు ఎడ్ల రవిపటేల్ మాట్లాడుతూ మున్నూరుకాపులకు మంత్రివర్గంలో స్థానంలేకపోవడం శోచనీయమన్నారు. రూ.20 కోట్లతో కోకాపేటలో మున్నూరుకాపు సంక్షేమ భవనాన్ని నిర్మించాలని కోరారు.