మంత్రి నిరంజన్‌రెడ్డికి కేంద్రం ప్రశంసలు
సామాజిక బాధ్యతగా టీబీ రోగులకు తన వంతు సాయంగా సొంత ఖర్చుతో పౌష్టికాహారం అందిస్తున్నందుకు గాను వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని కేంద్రం ప్రశంసించింది.
- ‘లీడర్ లీడింగ్ బై ఎగ్జాంపుల్’ అని ట్వీట్
- టీబీ రోగులకు బలవర్ధక మైన ఆహారం అందిస్తుండటంపై కితాబు
వనపర్తి, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): సామాజిక బాధ్యతగా టీబీ రోగులకు తన వంతు సాయంగా సొంత ఖర్చుతో పౌష్టికాహారం అందిస్తున్నందుకు గాను వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని కేంద్రం ప్రశంసించింది. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ ట్వీట్ చేసింది. ‘లీడర్ లీడింగ్ బై ఎగ్జాంపుల్’ అంటూ కొనియాడింది.
టీబీ రోగులకు సహకారం అందించేందుకు నిక్షయ మిత్ర పేరిట కేంద్రం ఓ కార్యక్రమం ప్రవేశపెట్టింది. అందులో భాగంగా దాతల నుంచి సహకారం కోరింది. వెంటనే స్పందించిన మంత్రి నిరంజన్‌రెడ్డి సొంతంగా బియ్యం, నూనె, పప్పు, పండ్లు, కోడిగుడ్లు, నిత్యావసర సరుకులు ఉన్న బలవర్ధకమైన ఆహారాన్ని ప్రతినెలా అందించేందుకు ముందుకొచ్చి ఈ నెల 94 మందికి పంపిణీ చేశారు. నిరంజన్‌రెడ్డి స్ఫూర్తిగా మంత్రి హారీశ్‌రావు టీబీ రోగులకు సహాయం అందించేందుకు ముందుకొచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్లోకి దుడ్డు ఆకాశ్
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

