హైదరాబాద్, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ) : తెలంగాణ సాధన పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 27న లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఉత్సవంగా నిర్వహించాలని ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు విజ్ఞప్తిచేశారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని బీసీ సంక్షేమ శాఖను ఆదేశించించారు. అలాగే వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిశ్చయించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 26న ఏర్పాట్లు చేయాలని బీసీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీచేశారు.
దర్శనం మొగిలయ్యకు ఇంటి స్థలం ;ధ్రువీకరణ పత్రం అందజేత
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని హయత్నగర్లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. ఇందుకు సంబంధించిన స్థల ధ్రువీకరణ పత్రాన్ని మంగళవారం మొగిలయ్యకు సీఎం రేవంత్రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అందజేశారు.