హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): న్యాయవాదులు కృత్రిమ మేధ(ఏఐ)ని అందిపుచ్చుకోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ పిలుపునిచ్చారు. కేసుల సత్వర పరిషారానికి ఏఐ తోడ్పడుతుందని చెప్పారు. హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ (హెచ్‌సీఏఏ) ఆధ్వర్యంలో సోమవారం హైకోర్టు ఆవరణలో న్యాయవాదులతో జరిగిన చర్చా కార్యక్రమంలో జస్టిస్ నరసింహ పాల్గొన్నారు. కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, ఇతర న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి, ఏఏజీ తేరా రజనీకాంత్‌రెడ్డి, అడిషనల్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్స్ నరసింహశర్మ, భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.