హైదరాబాద్, జులై11 (నమస్తే తెలంగాణ): సిద్దిపేటలో ఓ న్యాయవాదిపై పోలీసులు దాడి చేయడాన్ని హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.హైకోర్టు ఆవరణలో గురువారం న్యాయవాదులు పోలీసుల చర్య పై నిరసన తెలిపారు.బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశా రు. ఒక కేసులో ముందస్తు బెయిల్ ఉత్తర్వుల ప్రతిని సమర్పించేందుకు వెళ్లిన న్యాయవాది రవికుమార్‌పై ఏఎస్ఐ ఉమారెడ్డి దాడి చేయడం హేయమని మండిపడ్డారు.
సీఐ ఆదేశాలకు అనుగుణంగానే ఏఎస్ఐ దాడి చేశారని ఆరోపించారు.ఈ సందర్భంగా హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యాడపు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. దాడిని ప్రశ్నించిన న్యాయవాది ఫోన్ ను లాకోవడమే కాకుండా తీవ్రంగా గాయపరిచారని ఆరోపించారు. పైగా, న్యాయవాదే విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారన్నారు.
డీజీపీ జోక్యం చేసుకుని ఏఎస్ఐతో పాటు తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదులో పాల్గొన్న పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏఎస్ఐ ఉమారెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోపాటు న్యాయవాదిపై పెట్టిన ఎఫ్ఐఆర్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు దీప్తి, కార్యదర్శులు శాంతిభూషణ్, సంజీవ్, సంయుక్త కార్యదర్శి నవీన్‌కుమార్, న్యాయవాదులు పాల్గొన్నారు.