Kaleshwaram Project | హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్టుపై పిటిషన్.. విచారణ సోమవారానికి వాయిదా..!
Kaleshwaram Project : కాళేళ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)లో కుంగిన బ్యారేజీలకు మరమ్మతు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ శరత్ అనే న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు.
Kaleshwaram Project : వర్షాభావ పరిస్థితుల కారణంగా తెలంగాణ రైతాంగం సాగునీటికి గోస పడుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడంపై హైకోర్టులో పిటిషన్ నమోదైంది. కాళేళ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో కుంగిన బ్యారేజీలకు మరమ్మతు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ శరత్ అనే న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లకు మరమ్మతలపై అలసత్వాన్ని ప్రశ్నించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేరుస్తూ ధర్మాసనంలో పిటిషన్ వేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిన బ్యారేజీలకు మరమ్మతులు చేయాలని ఎన్డీఎస్ఏ(NDSA) పేర్కొన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని న్యాయవాది శరత్ వాపోయారు. రాజకీయ దురుద్దేశంతోనే ప్రభుత్వం మరమ్మతులు చేపట్టడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు.
అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టులపై నివేదికను సమర్పించిన ఎన్డీఎస్ను మరోసారి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిలను పరిశీలించేందుకు వెళ్లాల్సిందిగా ఆదేశించాలని న్యాయవాది శరత్ తన పిటిషన్లో కోరారు. దాంతో, ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్పై జూలై 20, సోమవారం ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తామని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అందువల్ల.. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

