హైదరాబాద్, ఆగస్టు 28: పెయింట్స్ రంగంలో ఉన్న టెక్నో పెయింట్స్..హైదరాబాద్లో తన తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించింది. 2,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో రెండు వందలకు పైగా ఉత్పత్తులను ఆఫర్ చేస్తున్నట్లు టెక్నో పెయింట్స్ సీఎండీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వ్యాపార విస్తరణలో భాగంగా వచ్చే ఏడాదికాలంలో అన్ని మెట్రో నగరాల్లో ఎక్స్పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్లోని కూకట్పల్లి వద్ద ఏర్పాటు చేసిన ప్లాంట్లో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించినట్లు, దేశీయంగా డిమాండ్ అధికంగా ఉండనుండటంతో ఈ యూనిట్ సామర్థ్యాన్ని మరింత పెంచుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.