హైదరాబాద్, ఫిబ్రవరి13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో ఆన్లైన్ హజ్ అప్లికేషన్ ఫెసిలిటేషన్ కౌంటర్‌ను హజ్ కమిటీ చైర్మన్ సలీంతో కలిసి హోంమంత్రి మహమూద్ అలీ సోమవారం ప్రారంభించారు. 2023లో హజ్‌యాత్రకు వెళ్లే వారందరూ ఆన్లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే, హజ్ కమిటీ మెంబర్ మెరాజ్ సాహబ్, వక్ఫ్‌బోర్డు చైర్మన్ మసీవుల్లా ఖాన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్, కమిటీ మెంబర్లు జాఫర్ హుస్సేన్, సయ్యద్ నిజాముద్దీన్, జాఫర్‌ఖాన్, నాదర్, హజ్ కమిటీ సీఈవో షఫిఉల్లా తదితరులు పాల్గొన్నారు.