నీట్ విద్యార్థులపై లాఠీచార్జి అమానవీయం.. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై పోలీసులు జరిపిన లాఠీచార్జీని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు.
హైదరాబాద్, జూలై 20(నమస్తే తెలంగాణ): నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై పోలీసులు జరిపిన లాఠీచార్జీని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై సోమవారం ప్రకటన విడుదల చేస్తూ, ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘మార్చ్ టు పార్లమెంట్’ పేరిట చేపట్టిన నిరసన పూర్తి శాంతియుతమైనదని, వారిపై లాఠీచార్జి చేయడం అమానవీయమని, ఇది ప్రజాస్వామ్య హకులను కాలరాయడమేనని వ్యక్తంచేశారు.
లాఠీచార్జి దారుణం: తుంగ బాలు
తమ హకుల కోసం శాంతియుతం గా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జ రిగిన లాఠీచార్జీని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉ పాధ్యక్షుడు తుంగ బాలు సోమవారం ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. న్యా యమైన డిమాండ్ల కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులపై బలప్రయోగం చేయడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
విద్యార్థులపై నమోదైన కేసుల ను వెంటనే ఉపసంహరించుకోవాలని, లాఠీచార్జీకి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీచార్జి చేయడం, టియర్గ్యాస్ ప్రయోగించడం దారుణమని ఏ ఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

