హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ లాసెట్, పీజీలాసెట్ ఫలితాలు బుధవారం విడుదలకానున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేస్తామని లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి తెలిపారు.
లాసెట్ పరీక్షలను ఈ నెల 6న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు. తుది కీని ప్రకటించి, బుధవారం ఫలితాలు విడుదల చేస్తారు.