వెంకటాపురం(నూగూరు), డిసెంబర్ 10: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి అలుబాక, బోదాపురం శివారులోని గోదావరి లంకల్లో పుచ్చతోట వద్ద పెద్దపులి గాండ్రిపులు వినిపించడంతో తోటల వద్ద కాపలాకు వెళ్లిన రైతులు భయాందోళనకు గురయ్యారు. మంగళవారం ఉదయం రైతులు ఆ ప్రాంతంలో పరిశీలించగా పులి సంచరించినట్టు ఆనవాళ్లు కనిపించాయి. అటవీశాఖ అధికారులు గోదావరి పెద్ద లంక వద్ద పులి సంచరించిన ప్రాంతానికి వెళ్లి అడుగులను పరిశీలించారు.