హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకుని ఈనెల 17న పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. శుక్రవారం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో వృక్షార్చన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని సాధించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్ పుట్టిన రోజున వృక్షార్చన కార్యక్రమంలో పెద్దఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు రాజు ప్రజాపతి, బొలిశెట్టి నితిన్, ప్రవీణ్‌చారి, నాగరాజు, పోత సుధీర్‌కుమార్, జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.