యంగ్ ఇండియాకు స్థలాల గండం.. ఆరుచోట్ల కేటాయింపు పెండింగ్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూళ్ల నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా వీటికి స్థలాల సమస్య పట్టిపీడిస్తున్నది. ఆరు నియోజకవర్గాల్లో స్థల సేకరణ సమస్యలు ప్రాజెక్ట్‌కు అడ్డంకిగా మారాయి. ప్రతిపాదిత స్థలాలు అనేక చిక్కుల్లో ఉన్నాయి.
- కోర్టు కేసులు, ఎన్వోసీల సమస్యలు
- ఏండ్లు గడుస్తున్నా కానరాని పురోగతి
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూళ్ల నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా వీటికి స్థలాల సమస్య పట్టిపీడిస్తున్నది. ఆరు నియోజకవర్గాల్లో స్థల సేకరణ సమస్యలు ప్రాజెక్ట్‌కు అడ్డంకిగా మారాయి. ప్రతిపాదిత స్థలాలు అనేక చిక్కుల్లో ఉన్నాయి. ఎన్వోసీల జారీలో జాప్యం.. కోర్టు కేసుల వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో భూసేకరణ, స్థల అనుకూలత వంటి సమస్యలు కూడా గుదిబండగా మారాయి. టెండర్లు ఖరారైనా పనులు యథావిధిగా సాగని పరిస్థితి నెలకొన్నది. ఏండ్లు గడుస్తున్నా పురోగతి కానరావడంలేదు. దీంతో ఇవి ఎప్పుడు పూర్తవుతాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ పరిస్థితి..
- మహబూబ్‌నగర్‌లో సర్వే నంబర్ 867 బండమీదిపల్లిలో భూమి కేటాయించారు. కానీ ఇది అసైన్డ్ ల్యాండ్‌గా తేలింది.
- మిర్యాలగూడలో తొలుత కేటాయించిన స్థలం అనుకూలంగా లేదు. ప్రత్యామ్నాయ స్థలం కోరగా.. పురోగతి లేదు.
- వర్ధన్నపేటలో ప్రత్యామ్నాయ స్థలం గుర్తించినా నీటిపారుదల శాఖ నుంచి రావాల్సిన ఎన్వోసీ పెండింగ్‌లో ఉంది.
- నర్సంపేటలో భూమి కేటాయించారు. హక్కు పత్రాలు కూడా ఇచ్చారు. కానీ ఆయా స్థలాన్ని భౌతికంగా స్వాధీనం చేయలేదు. కలెక్టర్‌ను ఇదే విషయం కోరినా పురోగతి లేదు.
- ఇల్లందు నియోజకవర్గంలో కేటాయించిన భూమిపై హైకోర్టులో కేసు ఉంది.
- హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్టలో స్థలం కేటాయించారు. కానీ హెరిటేజ్ శాఖ నుంచి ఎన్వోసీ జారీకావాల్సి ఉంది.
85 అనుమతులు.. 78 టెండర్లు పూర్తి
రాష్ట్రవ్యాప్తంగా 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురుకులాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకున్నది. ఇప్పటివరకు 85 పాఠశాలలకే పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. మరో 20 నియోజకవర్గాలకు పరిపాలనా అనుమతులు రావాల్సి ఉంది. 85లో 81 స్కూళ్లకు టెండర్లు పిలువగా..78 టెండర్లు ఖరారయ్యాయి. మరో మూడు టెండర్లకు సాంకేతిక మూల్యాంకనం నడుస్తున్నది. మరోనాలుగు టెండర్లు ఇంకా పిలువాల్సి ఉంది. ఖరారైన 78 టెండర్లలో 64 పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 9 చోట్ల కాంట్రాక్టర్ల మొబిలైజేషన్ అడ్వాన్స్లిచ్చే స్థితిలో ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

