న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3 : నేపాల్ సరిహద్దు ప్రాంతంలో భారీ వరదలు సంభవించిన వారం రోజుల తర్వాత గురువారం టిబెట్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 5గా నమోదైంది. జర్మన్ జియోసైన్సెస్ పరిశోధనా కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఎలాంటి నష్టం లేదా గాయాలు జరిగినట్టు తక్షణ సమాచారం లేదు.
నేపాల్ సరిహద్దు సమీపంలోని టిబెట్‌లో హిమానీనదం కూలిపోవడం వల్ల ఆగస్టు 26న సంభవించిన భారీ జలప్రళయం పట్టణాలు, లోయల గుండా దూసుకెళ్లి తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. గురువారం నాటికి నేపాల్‌లో కనీసం 1,252 మంది మరణించినట్టు నిర్ధారణ కాగా 4,200 మందికిపైగా ఆచూకీ తెలియకుండా పోయారు. సరిహద్దు అవతల టిబెట్‌లో మరణించిన వారి సంఖ్యను చైనా 21గా సవరించింది. అలాగే అక్కడ 541 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.